- ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) నిజామాబాద్ జిల్లా సమితి అధ్వర్యంలో విద్యాశాఖ నుండి ఎటువంటి అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థ శ్రీ చైతన్య (CBSE) స్కూల్ ప్తెనా చర్యలు తీసుకోవాలని శుక్రవారం నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీ నాగ జ్యోతి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ నిజాంబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు లో గల నేషనల్ మార్ట్ వెనకాల కార్పొరేట్ శ్రీ చైతన్య (CBSE) స్కూలు పేరుతో విద్యా శాఖ నుండి ఎటువంటి అనుమతి లేకున్నా అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తున్నరని తెలిపారు. భవనం పూర్తి కాకముందే శ్రీ చైతన్య విద్యా సంస్థ పేరు మీద బ్రోచర్లు ప్రింట్ చేసి మరి విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ అడ్మిషన్లు చేస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యాసంస్థల యజమాన్యం పైన చట్టపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలయాలన్నారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి శ్రీ చైతన్య విద్యాసంస్థలు మోసపూరితమైన ప్రకటనలపై అడ్మిషన్లు నిర్వహిస్తున్న (పిఆర్ఓ) ప్తెనా చర్యలు తీసుకోవాలన్నారు.. విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని అవసరమనుకుంటే డీఈఓ కార్యాలయం ముట్టడి చేస్తామని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం గా విన్నవించడం ఏమిటంటే 2025_ 26 సంవత్సరానికి సంబంధించి శ్రీ చైతన్య నూతన బ్రాంచ్ కి విద్యాశాఖ నుండి ఎటువంటి అనుమతి లేనందున గమనించి మీ పిల్లలను ఆ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు తీసుకొని మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, నాయకులు నవీన్ కృష్ణ, రమేష్, కార్తీక్ ,రంజిత్ పాల్గొన్నారు.