. . . ఖైదీలను డబ్బుల కోసం పీడిస్తున్న వైనం
. . . బీడీలకు ఒక రేటు…. సిగరేట్ కావలంటే ఇంకో రేట్
. . . సెల్ లో వేస్తామని కొత్త రిమాండ్ ఖైదీలను బెదిరించి వసూళ్లు
. . . ఇద్ధరు ఖైదీలను జైలు సిబ్బంది చితకబాదడంతో వెలుగులోకి
. . . ఇద్ధరు ఖైదీలను కామారెడ్డి సబ్ జైలుకు తరలింపు
. . . విచారణ చేపట్టిన జైళ్ళ శాఖ
నిజామాబాద్, బతుకమ్మ:
స్వాతంత్ర సమరయోదులను చిట్ట చివర జైలు శిక్షగా ద్విపాంతర వాస శిక్ష కోసం అనాడు పోర్ట్ బ్లేయర్ జైలుకు పంపేవారు అంగ్లేయులు. చాలమంది కాలపాని ( పోర్ట్ బ్లేయర్ జైలు)లో శిక్షను అనుభవించిన వారు తిరిగి వచ్చిన దాఖాలాలు లేవని ఎన్నో కథలు కథలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏకంగా మళాయాళి డైరెక్టర్ దానిపై కాలాపానీ అని సినిమాను తీయడంతో ఈ విషయం ప్రస్తుతం చాలమందికి అవగాహన ఉంది. అనాడు బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాడిన వారిని కాలపానీ జైలులోని (అండసెల్) వేసి చిత్రహింసలకు గురి చేసిన చేదు ఘటనలు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా సారంగపూర్ లోని సెంట్రల్ జైలులో అధికారుల ఆక్రుత్యాలు అన్ని ఇన్ని కావు.డబ్బుల కోసం ఖైదీలను పీల్చిపిప్పి చేస్తున్నారు. దాని కోసం ఖైదీలను వేదించడం,అవసరమైతే చితక బాధడం చేస్తున్నారు. దానితో ఇటివల కాలంలో తరుచు కేంద్ర కారాగారం వివాదాలలో చిక్కుతుంది. ఇటివల జైలులో ఇద్ధరు ఖైదీలు గంజాయి సెవించిన విషయం తెలిసిన అధికారులు వారిద్ధరని చితకబాదారు. వారికి తీవ్రగాయాలు కాగా వారిద్ధరిని మెజిస్ట్రేట్ ముందు హజరుపరుచగా అదికారుల పై వారు పిర్యాదు చేశారు. దానితో ఇద్ధరు ఖైధిలను కామారెడ్డి సబ్ జైలుకు తరలించి సంబంధిత నివేధికను జైళ్ల శాఖకు నివేధించడంతో నిజామాబాద్ సెంట్రల్ జైలులో అధికారుల దుర్మర్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏకంగా వాట్సప్ కాల్ చేసి డబ్బులు తేవాలని బెదిరించిన వైనం వెలుగు లోకి వచ్చింది. ప్రధానంగా కొందరు సారంగపూర్ చెందిన వ్యక్తులను మద్యవర్తులుగా పెట్టుకుని డబ్బులు వసూలు చేసి తమ చేతికి మట్టి అంటకుండా వసూళ్లు చేస్తున్నారు. సిగరేట్, బీడీ,గంజాయి అలవాటు కలిగిన వారికి వాటిని అందించేందుకు రేట్ లు పెట్టి వసూళ్లు జరుగుతాయని ఇటివల జైలులో గంజాయి రావడం దాని కోసం ఇద్ధరు ఖైదీల మద్య గోడవ,అధికారుల దౌర్జన్యం వ్యవహరం అందులో భాగమే అని తెలిసింది.
ప్రారంభంలో జిల్లా జైలుగా ఉన్న నిజామాబాద్ కు వరంగల్ సెంట్రల్ జైలును తరలించడంతో దానిలో ప్రస్తుతం 1500 వరకు ఖైదీలు ఉన్నారు. అందులో శిక్ష పడిన వారు కొందరైతే, మరికోందరు రిమాండ్ ఖైదీలున్నారు. అందులో ఓపేన్ ఎయిర్ జైలులో కోందరు సత్ప్రవర్తన ఖైదీలతో పనిచేయిస్తున్నారు. అంతే గాకుండా జైళ్ల శాఖ అధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ లలో పనిచేయిస్తున్నారు. ఇటీవల సెంట్రల్ జైలులో వరంగల్ నుంచి హ్యండ్ లూమ్ ప్లాంట్ ను తరలించడంతో కొందరు ఖైదీలు చేనేత పని చేస్తున్నారు. ఇదంతా పార్శ్వానికి ఓకవైపు మాత్రమే.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటివల రైల్వే స్టేషన్ వద్ధ యాచించి జీవిస్తున్న జంట తమ బిడ్డను విక్రయించారు. అ బిడ్డను కొనుగోలు చేసిన వ్యక్తిని, మద్యవర్తులను మొత్తంగా ఐదుగురిని నగరంలోని ఒకటవ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. రిమాండ్ కు వచ్చిన ఖైదీలలో బిడ్డను కోనుగోలు చేసిన తండ్రి వద్ధ జైలు అధికారులు అతనిని సెల్ లో వేస్తామని బేదిరించి రూ.20 వేల వరకు అతని కుటుంబ సభ్యుల వద్ధ వసూలు చేశారు. అంతే గాకుండా గత కొన్ని రోజుల క్రితం జీవిత ఖైదు అనుభవిస్తున్న నాగారం కు చెందిన వ్యక్తిని జైలు అధికారులు తీవ్రంగా చితక బాదారు. అ వ్యవహరం బయటకు రాకుండా చేయడానికి అ కుటుంబానికి డబ్బులను ఏరగా వేయడం గమానర్హం. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ అధికార పార్టీ నేత తనయుడు బైక్ ల దొంగతనాల కేసులో సెంట్రల్ జైలుకు రిమాండ్ పంపారు పోలీసులు. అక్కడ అతని కుటుంబ సభ్యుల వద్ధ కాసులు పుచ్చుకుని అతడిని ఆనారోగ్యం కారణం చూపుతు ప్రైవేట్ ఆసుపత్రిలో బోగ భాగ్యాలను కల్పించడం విశేషం. సెంట్రల్ జైలులో ప్రతి ఒక్క దానికి రేట్ ఫీక్స్ చేసినట్లు అక్కడ శిక్ష అనుభవించిన ఖైదీలు, రిమాండ్ నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన వారి ద్వారా వెల్లడవుతుంది. సిగరేట్ బీడీ అలవాటు ఉన్నవారికి వాటిని ఇచ్చేందుకు జైలు అధికారులు నిర్ణయించిన ధరను చూస్తే కళ్లుతిరగడం ఖాయం. అంబర్ ప్యాకేట్ లకు రూ.500, సిగరేట్ లు, బీడిలకు రూ200 తక్కువగా కాకుండా తీసుకుంటారంటే అతిశయోక్తి కాదు. లేని ములాఖాత్( ఖైదీలను కుటుంబ సభ్యులు) కలవడం కూడా రేట్ పిక్స్ చేశారంటే ఈ వ్యవహరం అధికారుల వసూళ్ల వ్యవహరం ఎంత ఫీక్ స్టేజీకి వేళ్లిందో చెప్పకనే చెబుతుంది. అందులో శిక్ష అనుభవించే ఖైదీలకు రాజబోగాలు అనుభవిస్తున్నారని తోటి ఖైదీలు చెబుతున్నారు. ప్రధానంగా అదివారం ఇచ్చే మాంసం వడ్డించాలంటే డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కొందరికి వైధ్యం పేరిట దవాఖానాలకు ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తారని పేరుంది. జైలు శిక్ష పూర్తయిన ఖైదీలు చివరఖారుకు నజరానాలు( గిప్ట్) లు తీసుకుంటారని ప్రతీతి. నిషేదిత గంజాయి అలావాటు పడిన వారి నుంచి వసూళ్ల కోసం జరుగుతున్న తతంగంతో సెంట్రల్ జైలు మరోసారి వివాధంలో చిక్కుకుంది. జైళ్ల శాఖాధికారులు శాఖ పరమైన విచారణలో ఏ మేరకు అవినీతి, అక్రమ వసూళ్లను వెలికి తీస్తారో వెచి చూడాల్సిందే.

