29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మరణంలోను వీడని అను(బంధం)

Must read

📰 Generate e-Paper Clip

 

భర్త సమాధి ముందు రోదిస్తూ మృతి చెందిన భార్య

 కోటగిరి, బతుకమ్మ:

భర్త మృతి చెందిన మరునాడే  అతని సమాధి వద్ద రోదిస్తుూ భార్య మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని యాద్గార్‌‌పూర్ గ్రామంలో చోటుచేసుకోంది. 24 గంటల వ్యవధిలో భార్య భర్తల మరణంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద అలుముకుంది. యాద్గార్ పూర్ కు చెందినసాయిలు(70), భార్య లచ్చవ్వ(65) తో జివిస్తున్నాడు.వారికి ఐదుగురు సంతానం కాగా అందులో ఇద్దరు కూతుళ్లకు పెళ్లై అత్తారింటికి వెళ్లిపోగా ముగ్గురు కొడుకుల్లో ఇద్దరికి పెళ్లై వేరే కాపురం ఉన్నారు,ఒక కొడుకు హైదరాబాద్‌లో ఉన్నా ఆ వృద్ధ దంపుతులు మాత్రం ఎవరి దగ్గరా ఉండకుండా ఇద్దరూ ఒకే చోట ఉండి చాలా రోజులుగా జీవనం సాగిస్తున్నారు.యాభై ఏండ్ల సంసార జీవితంలో ఆ దంపతులు ఏనాడూ ఒకరినొకరు విడిచి ఉండలేదు…  గత నెల రోజుల క్రితం అనారోగ్య పాలైన భర్త సాయిలు(70)మంచం పట్టాడు ఆయనకు భార్య లచ్చవ్వ(65) నెలరోజులుగా సేవలు చేయగా చివరికి ఆరోగ్యం విషమించి మంగళవారం భర్త సాయిలు మృతి చెందగా బుదవారం ఆయన అంత్య క్రియలు జరిగాయి.గురువారము ఉదయం అంత్య క్రియల కార్యక్రమంలో భాగంగా కుటుంబీకులు మరోసారి స్మశానానికి వెళ్లగా సాయిలు భార్య లచ్చవ్వ ఒక్కసారిగా అక్కడ కుప్ప కూలి పోయింది. వెంటనే ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.బుధవారం భర్త అంత్యక్రియలు జరగగా గురువారం భార్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీంతో ఇన్నాళ్లూ అన్యోన్యంగా ఉన్న భార్యా భర్తలను మృత్యువు కూడా విడదీయలేకపోయిందని మృత్యువులోనూ భార్యా భర్తలు ఒకరికి తోడుగా మరొకరు వెళ్లటంతో కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి.రెండు రోజుల్లో ఒకే కుటుంబంలో రెండు మరణాలు సంభవించటంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.

More articles

Latest article