26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పల్లె దవాఖానాలో కానరాని వైద్యుడు

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్, బతుకమ్మ:  జుక్కల్ మండలం పెద్ద ఏడ్గి గ్రామంలోని పల్లె దావాఖాన పరిస్థితి విచిత్రంగా మారింది. పల్లె దావాఖాన ఉన్న ఉపయోగం లేకుండా పోయింది. గతంలో వైద్య సేవలు అందించిన ఎం ఎల్ హెచ్ పి ఆరు నెలల నుంచి ఆసుపత్రికి రావడం లేదు. ఎవరికి అదనపు బాధ్యతలు కూడా అప్పగించలేదు. దీంతో ఆరు నెలలుగా గ్రామంలోని పల్లె దావాఖాన  లో వైద్య సేవలు నిలిచిపోయాయి. వైద్య సేవల కోసం వస్తున్న గ్రామ ప్రజలు, చుట్టూ ప్రక్కల ఉన్న గ్రామాలకు చెందిన ప్రజలు వైద్యుడు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . డాక్టర్ లేకపోవడంతో రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డాక్టర్ ను నియమించాలని కోరుతున్నారు.

More articles

Latest article