26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ర్యాంకులే లక్ష్యంగా చదివితే విజయం మీ సొంతం 

Must read

📰 Generate e-Paper Clip

  • ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ర్యాంకులే లక్ష్యంగా చదివితే విజయం మీ సొంతం అవుతుందని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ విద్యార్థి ఉద్య మ వేదిక రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు  రమావత్ లాల్ సింగ్ ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 2024-25  అకాడమీ ఎక్సెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగం రాక పోతే నిరాశ చెందకుండా స్వయం ఉపాధి కల్పించేల కంపెనీలు పెట్టాలని సూచించారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. యువత డ్రగ్స్ దూరంగా ఉండాలని  సూచించారు.  అతిథులు డిఐఈఓ రవి కుమార్, డి.ఇ.ఓ అశోక్, బిసిడబ్యూ  నర్సయ్య ,  జిజి కళాశాల ప్రిన్సిపాల్ రాం మోహన్ రెడ్డి,  అడ్వకేట్ ఆశ నారయణ, మాట్లాడుతూ  సాధారణ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక విద్యార్థి సంఘ సభ్యులను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి టీవియువి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమావత్ లాల్ సింగ్ మాట్లాడుతూ అధిక మార్కులు సాధిం చిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఈ అకాడమీ ఎక్సెన్స్ అవార్డు నిర్వహించడం జరుగు తుందని అన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో  టివియువి జిల్లా కన్వీనర్ అజయ్,, సుభాష్, పవన్, సాయి సోను, సాయి తేజ , సతీష్ విద్యార్థులు పాల్గొన్నారు.

If you study with ranks as your goal, success is yours.

More articles

Latest article