బూటకపు ఎన్ కౌంటర్ పై విచారణ జరిపించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, 27 మంది ఆదివాసులను బూటకవు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపడానికి ఖండిస్తూ,సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే న్యాయ విచారణ జరపాలని,ఆపరేషన్ 'కగార్'ని వెంటనే ఆపివేసి, మావోయిస్ట్ లతో శాంతి చర్చలు జరపాలని వామ పక్షాల నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ, సిపిఐ (యం),సి.పి.ఐ. (యం.ఎల్) మాస్ లైన్, సి.పి.ఐ. (యం.ఎల్) న్యూ డెమోక్రసీ,బహుజన సమాజ్ పార్టీ,పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల వేదిక, ఆధ్వర్యంలో గురువారం యన్. ఆర్, భవన్, కొటగల్లి,...