- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి ఐటీఐ కాలేజీని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)గా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుందని, ఇది నియోజకవర్గ విద్యార్థుల భవిష్యత్‌కు దారిచూపే కీలక అడుగు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. రూ.70 కోట్ల నిధులతో నిర్మాణ దశలో ఉన్న నూతన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను ఎమ్మెల్యే మదన్ మోహన్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు స్థానిక యువత మనసులోని ఆవేదనను గౌరవించి ఎల్లారెడ్డికి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎల్లారెడ్డి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇది పూర్తి కావడంతో పేద విద్యార్థులకు ఆధునిక, నాణ్యమైన, ప్రాక్టికల్ శిక్షణ అందుతుందన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అని తెలిపారు. ఈ సందర్శనలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల, టౌన్ అధ్యక్షులు, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
14523
