- పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల వెంటనే ఏర్పాటు చేయాలని, రెండో విడతలో కోర్సులను ఎందుకు పెట్టలేదో యూనివర్సిటీ అధికారులు బహిర్గతం చేయాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ పాలిటెక్నిక్ విద్యార్థులతో బుధవారం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండో విడత కౌన్సిలింగ్ లో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు అనుమతి వచ్చింది అని ప్రకటించిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ వెబ్ ఆప్షన్స్ లో ఎందుకు పెట్టలేదో బహిర్గతం చేయలనీ డిమాండ్ చేశారు. సీఎం జిల్లాకు మూడు ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులు లభించిన, పీసీసీ ఉన్న నిజామాబాద్ జిల్లాకు ఎందుకు అనుమతులు రావడంలేదని ప్రశ్నించారు. జిల్లా ప్రజా ప్రతినిధులు సీరియస్ గా దృష్టి ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు వత్తాసు పలుకుతున్నారా? అని ప్రశ్నించారు. వెంటనే మూడో విడత కౌన్సిలింగ్లో తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సుల వెంటనే పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిచో నిజామాబాద్ జిల్లాలో పార్టీలకు అతీతంగా అన్ని పక్షాలను కలుపుకుని ఇంజనీరింగ్ కళాశాల సాధన సమితి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా నాయకులు దేవిక, మనోజ్, నగర నాయకులు దుర్గాప్రసాద్, శ్రీజ, సాయి తదితదిరులు పాల్గొన్నారు.
