25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

క్రీడల్లో గెలుపోటములు సహజం

Must read

📰 Generate e-Paper Clip

  • ఓడిపోయామని ఎవరు నిరాశ పడొద్దు
  • మానసిక ప్రశాంతతకు క్రీడలకు ఆఫీసర్ క్లబ్ చక్కని వేదిక
  • జిల్లా నుంచి ఎంతోమంది అంతర్జాతీయ క్రీడాకారులు వెలుగొందారు వారందరికీ అభినందనలు
  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఆడిన వారు ప్రతి ఒక్కరూ గెలవాలని ఏమీ లేదని, ఓటమి చెందినవారుచాలెంజింగ్ గా తీసుకొని మరో ఆటలు గెలిచి సత్తా చూపెట్టాలనిజిల్లా జడ్జి సునీత కుంచాల పేర్కొన్నారు.జిల్లా కేంద్రంలోని ఆఫీసర్ క్లబ్లో గత రెండు రోజుల నుండి కొనసాగుతున్నబ్యాడ్మింటన్ క్రీడా ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న ఆఫీసర్ క్లబ్ ఎందరికో ఉదయం సాయంత్రం వేళల్లో మానసిక ఉల్లాసానికి ప్రశాంతతకు చక్కని వేదిక అని అన్నారు. ఇక్కడికి ప్రతిరోజు వివిధ రకాల క్రీడలను ఆడేందుకు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులే కాకుండా, సమాజంలో గుర్తింపు పొందిన విశ్రాంత ఉద్యోగులు వ్యాపారస్తులు కూడా ఇక్కడికి వచ్చి క్రీడలు ఆడి ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారన్నారు. ఇది చాలా ఆనందకరమైన విషయం అన్నారు.వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసే ఉద్యోగులు తమ ఉద్యోగ నిర్వహణలో భాగంగా విధుల ఒత్తిడి నుండి దూరం అవ్వడానికిఇలాంటి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు.జీవితంలో ఉద్యోగం, ఇంటి బాధ్యతలు ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో, ప్రతిరోజు క్రీడలకు కూడా సమయాన్ని తప్పకుండా కేటాయించాలన్నారు.

Winning in sports is natural

అనంతరం ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ భారతదేశంలోనే తెలంగాణ లో ఉన్న ప్రతి జిల్లాలో ముఖ్యంగా గ్రామాల్లో క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని అన్నారు. నిజామాబాద్ అంటేనే ఎంతోమంది క్రీడాకారులకు పుట్టిన ఇల్లుగా మారిందని ఆయన అన్నారు. వివిధ క్రీడల్లో ఇక్కడ శిక్షణ పొంది రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిఫలం చాటి జిల్లాకీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారన్నారు.అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా క్రీడాకారులకు తమదైన విధంగా సాయం అందించే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామని అన్నారు.అనంతరం క్రీడల్లో గెలుపొందిన విజేతలకుజిల్లా జడ్జి బహుమతులు ప్రధానం చేశారు. బ్యాడ్మింటన్ క్రీడల్లో విజేతకు లక్ష రూపాయల నగదు బహుమతిని బహుకరించారు.కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, జాయింట్ సెక్రెటరీ వెంకట్ రాములు, ట్రెజరర్ గంగ కిషన్ ప్రముఖ వ్యాపారవేత దేవిదాస్, ఏ టి ఎస్ శ్రీనివాస్,భక్తవత్సలం,న్యాయవాదులు మాణిక్ రాజ్,ఆశా నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Winning in sports is natural

More articles

Latest article