29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మంతనాల వెనుక మతలబేమిటో..?

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: కేసీఆర్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై పొద్దున లేచిన నుంచి విమర్శలు చేసే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇటీవల కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఆయన కేటీఆర్, హరీశ్ రావుతో భేటీ అయినట్లు ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వారి మధ్య భేటీ ఏమిటనే చర్చ సాగుతోంది. వీరి మంతనాల వెనుక మతలబు ఏమిటని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

ఏది ఏమైనా.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మల్లన్న మరోసారి నిరూపిస్తాడా? అని పలువురు అంటున్నారు.

More articles

Latest article