మంతనాల వెనుక మతలబేమిటో..?
హైదరాబాద్, బతుకమ్మ: కేసీఆర్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై పొద్దున లేచిన నుంచి విమర్శలు చేసే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇటీవల కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన కేటీఆర్, హరీశ్ రావుతో భేటీ అయినట్లు ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వారి మధ్య భేటీ ఏమిటనే చర్చ సాగుతోంది. వీరి మంతనాల వెనుక మతలబు ఏమిటని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు...