24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలి

Must read

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే ధన్ పాల్

మండల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన

నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ అన్నారు. ఈమేరకు ఆయన జిల్లా విద్యాశాఖ అధికారికి పలు సూచనలు చేశారు.  నగరంలోని గౌతమ్ నగర్ ఓల్డ్ స్నేహ సొసైటీ పక్కన విద్య సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (TGEWIDC) ఆధ్వర్యంలో నిర్మించనున్న మండల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాదు నార్త్ విద్య శాఖ మండల వనరుల కేంద్ర భవన నిర్మాణ పనులను రూ. 40.70 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేశామన్నారు. భవన నిర్మాణ పనులు నాణ్యతతో, త్వరతగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్ పాల్ ను విద్యా శాఖ అధికారులు సత్కారించారు. ఈ కార్యక్రమంలో డీఈవో అశోక్, ఎంఈవో వెంకట నారాయణ, ఏఈ ఉదయ్ కిరణ్, కాంట్రాక్టర్ యాదగిరి, అధికారులు, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, మాయావర్ సాయి రం, రంజిత్, సంతోష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article