ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలి
ఎమ్మెల్యే ధన్ పాల్ మండల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ అన్నారు. ఈమేరకు ఆయన జిల్లా విద్యాశాఖ అధికారికి పలు సూచనలు చేశారు. నగరంలోని గౌతమ్ నగర్ ఓల్డ్ స్నేహ సొసైటీ పక్కన విద్య సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (TGEWIDC) ఆధ్వర్యంలో నిర్మించనున్న మండల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ...