= ఈనెల 27న విచారణకు హాజరు కావాలని ఆదేశం
వెబ్ న్యూస్, బతుకమ్మ : టాలీవుడ్ సినీనటుడు మహేశ్ బాబు కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈనెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసుల్లో ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది.ఈరెండు సంస్థలకు మహేశ్ బాబు ప్రచార కర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్ ప్లూయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. మహేశ్ బాబు కు ఆయా సంస్థలు చెల్లించిన పారితోషికంపై ఈడీ ఆరా తీయనుంది.
