27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జాతీయ స్థాయి మారథాన్ లో విజేతగా నిలిచిన శ్రీకాంత్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న 10 కి.మీ మారథాన్ లో నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నుంచి పాల్గొన్న క్యాడెట్ శ్రీకాంత్ 2 వ స్థానంలో నిలిచాడని ఎన్.సి.సి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి తెలిపారు. జాతీయ ఐక్యత, సాంస్కృతిక మార్పిడి, క్రమశిక్షణను పెంపొందించడానికి రూపొందించబడిన 12 రోజుల నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్ సిసి) ప్రత్యేక శిబిరం (ఎస్ఎన్ఐసి) కొక్రాఝర్, అస్సాంలో ఈ నెల 14 నుండి 25 వరకు జరుగుతోందన్నారు. క్యాడెట్లకు శిక్షణతో పాటు, వివిధ రకాల సాంస్కృతిక, సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక శిబిరంలో భారతదేశంలోని 17 ఎన్.సి.సి డైరెక్టరేట్ల నుండి ఎంపిక చేసిన  క్యాడెట్లు పాల్గొంటారని పేర్కొన్నారు. అలాగే నిజామాబాద్ నుంచి ముగ్గురు ఎన్.సి.సి క్యాడెట్లు శ్రీకాంత్, అమర్ సింగ్, జ్యోతి పాల్గొన్నారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ రంగరత్నం, అధ్యాపకులు, దండుస్వామి, బాలామణి, చంద్రశేఖర్, రంజిత, వినయ కుమార్,  కార్యాలయ బృందం విద్యార్థులు, తదితరులు క్యాడెట్లకు అభినందనలు తెలిపారు.

More articles

Latest article