జాతీయ స్థాయి మారథాన్ లో విజేతగా నిలిచిన శ్రీకాంత్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న 10 కి.మీ మారథాన్ లో నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నుంచి పాల్గొన్న క్యాడెట్ శ్రీకాంత్ 2 వ స్థానంలో నిలిచాడని ఎన్.సి.సి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి తెలిపారు. జాతీయ ఐక్యత, సాంస్కృతిక మార్పిడి, క్రమశిక్షణను పెంపొందించడానికి రూపొందించబడిన 12 రోజుల నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్ సిసి) ప్రత్యేక శిబిరం (ఎస్ఎన్ఐసి) కొక్రాఝర్, అస్సాంలో ఈ నెల 14 నుండి 25 వరకు జరుగుతోందన్నారు. క్యాడెట్లకు శిక్షణతో పాటు,...