29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

హత్యాయత్నం చేసిన ఒకరి రిమాండ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తను ఇచ్చిన అప్పు తిరిగి అడిగినందుకు కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసిన ఒకరిని  అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నగరంలోని త్రీ టౌన్ ఎస్ హెచ్ ఓ మహేష్ కుమార్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని  దుబ్బ ఏరియా కు చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి  తన మిత్రుడు అయిన  భాస్కర్ కి గత మూడు నెలల క్రితం 5000 రూపాయలు అప్పుగా ఇచ్చాడు.  డబ్బులు తిరిగి ఇవ్వమని విశ్వనాథ్ పదేపదే భాస్కర్ ని అడగగా భాస్కర్ విసుకు చెంది  విశ్వనాధ్ ని చంపేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ నెల 28 న విశ్వనాథ్ శివాజీ చౌక్ వద్ద తన ఆటోలో ఉండగా భాస్కర్ విశ్వనాధ్ ని  కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో తలపై, శరీర ఇతర భాగంలో నరికి అక్కడనుండి పారిపోయాడు. విశ్వనాథ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ కేసు నమోదు చేశారు.  టౌన్ సిఐ  జి శ్రీనివాస్ పర్యవేక్షణలో  టౌన్ 3ఎస్ హెచ్ ఓ యు మహేష్ కుమార్, తన సిబ్బంది కలిసి నిందితుడైన భాస్కర్ ని రెండు గంటల్లోనే పట్టుకొని, కత్తిని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.

More articles

Latest article