27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కబ్జాదారుల నుండి స్మశాన వాటికను కాపాడండి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో ముస్లిం మైనార్టీల స్మశాన వాటికను కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసుకుంటున్నారని అక్బర్ నగర్ మజీద్ కమిటీ సభ్యులు మంగళవారం రుద్రూర్ తహసిల్దార్ సురేందర్ నాయక్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో కూడా  స్మశాన వాటిక స్థలాన్ని కబ్జా గురైన విషయాన్ని రుద్రూర్ తహసిల్దార్ కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని మళ్లీ స్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అట్టి స్థలాన్ని కబ్జాదారుల నుండి రక్షించి స్మశానవాటికకు కేటాయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో మజీద్ సదర్ షేక్ మొహమ్మద్, షేక్ ఫహీం, షేక్ అన్వర్ జావీద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article