అక్రమ పుస్తకాల గదులను సీజ్ చేసిన ఎంఈఓ

0 14,564

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఎస్ ఆర్ ప్రైమ్ పాఠశాల లో అక్రమంగా పాఠ్యపుస్తకాల విక్రయాలపై ఏబీవీపీ మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూరు  విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ  ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా బుక్స్, యూనిఫామ్స్ పేరిట విద్యను వ్యాపారంగా మారుస్తు పేద మధ్యతరగతి విద్యార్థుల కుటుంబాలకు వారి తల్లిదండ్రులకు ఇబ్బందులకు గురి చేస్తున్నరని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్ట రాజ్యాంగ అమ్ముతున్న ఎస్ ఆర్ ప్రైమ్ స్కూల్  గుర్తింపు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా కన్వీనర్ బాలకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ సునీల్, కంటేశ్వర్ జోనల్ ఇంచార్జ్ దుర్గా దాస్, శ్రీశాంత్, నవీన్, మున్నా, శివ, సందీప్, యశ్వంత్, త్రిశాంత్, అజిత్, ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు.

MEO seizes illegal book rooms

Leave A Reply

Your email address will not be published.