27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

వడదెబ్బకు గురయ్యే హై రిస్క్ గ్రూపులో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఇతర దీర్ఘకాల వ్యాధుల బారిన పడిన వ్యక్తులు ఉంటారని, అందువల్ల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నగరంలోని గంగస్తాన్ ఫేస్ టు లో గల రామకృష్ణ మఠంలో బుధవారం సమ్మర్ క్యాంపుకు హాజరైన పాఠశాల విద్యార్థులకు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు, నివారణ చర్యలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లలు వడదెబ్బకు గురికాకుండా ఉదయం 11 గంటల లోపు, సాయంత్రం ఐదు గంటల తర్వాత బయటకు రావాలని, మధ్యాహ్నం ఎండ వేడిలో, తీవ్రమైన వడగాలులున్నందున బహిరంగ ప్రదేశాల్లో ఆడుకో రాదనీ అన్నారు. తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళినప్పుడు తలకు టోపీ లేదా గొడుగు వాడాలని, ఫుల్ హాండ్స్ షర్ట్స్ ధరించాలని, దాహం వేసిన వేయకపోయినా ప్రతి అరగంటకు ఒకసారి కొన్ని నీళ్లు త్రాగాలని  తెలిపారు. తంసప్, కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్ వాటర్ తాగరాదని, కుండ లో నీటిని త్రాగాలని, రోడ్లపై అమ్మే చిరుదిళ్లను, పిజ్జాలు బర్గర్లను, తినరాదని తెలిపారు. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలన్నారు. ఇంకా రక్తహీనత, పోషకాహారము, చేతుల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, అయోడిన్ డెఫిషియన్సీ, పొగాకు వాడకం వల్ల కలిగే అనర్ధాలు, జీవనశైలి మార్పులు, మానసిక ఒత్తిడి లాంటి అంశాలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్, ప్రసాద్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article