స్వీయ గణనలో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులు

0 9,719

 

. . . అభినందించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జనాభా గణన-2027లో భాగంగా కొనసాగుతున్న “స్వీయ గణన” ప్రక్రియలో భాగంగా బుధవారం కలెక్టరేట్ లో రెవెన్యూ ఉద్యోగులు స్వీయ నమోదు చేసుకున్నారు. ఉద్యోగులు ఎవరికి వారు తమ కుటుంబ వివరాలను పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిని అభినందించారు. మిగతా శాఖల ఉద్యోగులు కూడా వీరిని స్పూర్తిగా తీసుకుని స్వీయ గణన చేసుకోవాలని సూచించారు. ఈసారి జనాభా గణన-2027 డిజిటల్ విధానంలో నిర్వహించబడుతోందని తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకోవచ్చని సూచించారు. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ ద్వారా https://se.census.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్వీయ గణన చేసుకోవచ్చని అన్నారు. నమోదు అనంతరం ప్రతి వ్యక్తికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడి) వస్తుందని, దానిని భద్రపరచి ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు అందజేయాలని సూచించారు. అన్ని శాఖల ఉద్యోగులు, జిల్లా ప్రజలందరూ మే 10వ తేదీలోపు స్వీయ గణన పూర్తి చేసి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, శ్రీనివాస్ రావు, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.