28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జూనియర్ అసిస్టెంట్ గా ప్రసన్న హంసిక నియామకం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : కుమారి గుమ్మన్నగారి  ప్రసన్న హంసిక కు కారుణ్య నియామకంలో జూనియర్ అసిస్టెంట్ గా నియామక ఉత్తర్వులను వైస్ -ఛాన్స్లర్  ఆచార్య టీ.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి అందించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో  గతంలో సుదీర్ఘ కాలం పని చేసిన  కీర్తిశేషులు ఆచార్య జి. బాల శ్రీనివాస్ మూర్తి  అకాల మరణం చెందినారు. తెలంగాణ ప్రభుత్వ కారుణ్య నియామక జీవో. ఎం. ఎస్. నెంబర్ 400 ప్రకారం తన కూతురు జి ప్రసన్న హంసిక ను జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు అందించారు.    ఈ సందర్భంగా  ఉత్తర్వులు అందించిన వైస్ ఛాన్స్లర్, రిజిస్ట్రార్  కు తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూ టా ) అధ్యక్షులు డా. ఏ. పున్నయ్య, ఉపాధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి డాక్టర్ అడిగే నాగరాజ్  తదితరులు  కృతజ్ఞతలు తెలిపారు.

  • తెయూ డాక్టర్ టి సంపత్  అడిసినల్ కంట్రోలర్ గా నియామకం

తెలంగాణ వర్సిటీ లో  ఆడిసినల్ కంట్రోలర్  (కాన్ఫిడెషియల్ )గా డా. టీ.సంపత్ ను నియమిస్తూ వైస్ _ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఆచార్య. టి యాదగిరి రావు  నియామకపు ఉత్తర్వులు అందించారు. డా.టీ. సంపత్ దశాబ్ద కాలంగా  ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తున్నారు.  డా టీ. సంపత్ గతంలో ఆప్లైడ్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ గా, బి ఓ ఎస్  చైర్మన్ గా , వార్డెన్ గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డైరెక్టర్ గా, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్, ఈక్వల్  ఆపర్చునిటీ సెల్ చైర్మన్  గా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామర్  ఆఫీసర్ గా   విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందినారు.

Prasanna Hamsika appointed as Junior Assistant

More articles

Latest article