. టీచర్లు.. పట్టభద్రులు.. ఒకరికి మించి మరొకరు
. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 100 వరకు చెల్లని ఓట్లు
కరీంనగర్, బతుకమ్మ : పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న చాలా మంది పట్టభద్రులు, టీచర్లకు ఓటు ఎలా నమోదు చేయాలో తెలియలేదు. ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సిన వారు అయోమయానికి గురయ్యారు. దీంతో ఒక్క పోలింగ్ సెంటర్ లో సుమారు 90 నుంచి 100 వరకు చెల్లని ఓట్లు నమోదవుతుండడం అభ్యర్థుల్లో టెన్షన్ పెంచుతోంది. పోలైన ఓట్ల నుంచి చెల్లని ఓట్లను కౌంటింగ్ సిబ్బంది పక్కన పెడుతున్నారు. బ్యాలెట్ పేపర్ పై కొందరు టీచర్లు సంతకాలు చేయగా, మరికొందరు టీచర్లు, పట్టభద్రులు నంబర్లు వేయాల్సిన చోట రైట్ మార్క్ చేశారు. చాలా మంది టీచర్లకు ఓటు వేయడంపై అవగాహన లేని విషయం తేటతెల్లమైంది. గ్యాడ్యుయేట్ల ఓట్లను 21 టేబుళ్లలో, టీచర్ల ఓట్లను 14 టేబుళ్లపై లెక్కిస్తున్నారు. అభ్యర్థులు, వారి తరఫు ఏజెంట్ల సమక్షంలో చెల్లని ఓట్లు, చెల్లుబాటు అయ్యే ఓట్లను సిబ్బంది వేరు చేస్తున్నారు.

