29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మాది లొంగుబాటు కాదు :  చంద్రన్న

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : ఇప్పటివరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పని చేశామని, భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పని చేస్తాననీ మావోయిస్టు సీనియర్ నేత చంద్రన్న అన్నారు. మంగళవారం మరో సీనియర్ నేత బండి ప్రకాష్ తో తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన ఆయన మీడియాతో మాట్లాడారు.  మా సిద్ధాంతం ఓడిపోలేదని,  ఓడించడం ఎవరితరం కాదన్నారు. మా భావాజాలంతో భవిష్యత్తులో మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉందని, ప్రస్తుతం అనారోగ్య కారణాలతో  ప్రజల మధ్య ఉండి సేవ చేయాలనుకున్నానని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు.  ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్ జీ కొనసాగుతున్నాడని, సిద్ధాంత పరంగా తాను దేవ్‌జిని సపోర్ట్ చేస్తున్నానని తెలిపారు. ఉద్యమం లో నుంచి బయటకు వచ్చేముందు ఆయుధాలను పార్టీకి ఇచ్చి వచ్చానని అన్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఏమీ ఆశించడం లేదన్నారు.

More articles

Latest article