మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎగువ బాగాన మహా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బుధవారం మూయడానికి త్రీ సభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో మూసివేయున్నారు. కానీ ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టు నిండుకుండలా జలకల సంతరించుకుంది. దీంతో ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కావున బాబ్లీ గేట్లు మూసివేసే అవకాశం లేదని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి కాబట్టి త్రిసభ్య కమిటీ సభ్యులు బాబ్లీ ప్రాజెక్టుకు చేరుకొని సంతకాలు చేసి వరద తగ్గిన వెంటనే బాబ్లిగేట్లను మూసి వేసుకొని అవకాశం నాందేడ్ ఇరిగేషన్ అధికారులకు ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన గేట్లను ఎత్తి అక్టోబర్ 29న మూసి వేయాలి. మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటికి బదులుగా మార్చి 1వ తేదీన బాబ్లీ గేట్లు ఎత్తి 0.6 టిఎంసి నీటిని ఎస్సారెస్పీకి అందించాలని తీర్పులో పేర్కొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 888 టీఎంసీల నీరు రావడం జరిగిందని అలాగే 820 టీఎంసీల నీరు ప్రాజెక్టు నుండి బయటకు విడుదల చేయడం జరిగిందని అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ విషయంపై బతుకమ్మ ఎస్సారెస్పీ ఎస్. ఈ జగదీష్ ను చరవాణిలో సంప్రదించగా త్రీ సభ్య కమిటీ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను మూసివేసి వస్తున్న వరదల దృష్టిలో ఉంచుకొని కొన్నిటిని తెరిచి ఉంచే అవకాశం ఉందన్నారు.


