24.7 C
Hyderabad
Monday, August 3, 2026

జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో నిజామాబాదు నారాయణ కు ఆలిండియా ర్యాంకులు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

జే ఈ ఈ అడ్వాన్స్ 2026 ఫలితాలలో నారాయణ (నిజామాబాద్) జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఆలిండియా ర్యాంకులు సాధించారు. సోమవారం నాటి ఫలితాలలో క్రాంతికుమార్ ఆలిండియా 257ర్యాంకు,  ఎమ్. విజయ్ 345ర్యాంక్ , ఆర్. రాంచరణ్ 732 ర్యాంక్,  పల్లెర్ల విరాజ్ 2899 ర్యాంక్,  శ్రీ చరణ్ ఆదిత్య 9150  ర్యాంక్ లు సాధించారు.

 

Nizamabad Narayana secures All India ranks in JEE Advanced results

 

కళాశాల యాజమాన్యం క్యాంపస్ లో ఐఐటీ ర్యాంకర్స్ ని అభినందించారు. నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడం అనేది మన జిల్లాకి గర్వకారణం అని నారాయణ కళాశాల నిజామాబాద్ ఏజిఎం కుంట లక్ష్మారెడ్డి , డీన్ మంజుల , ప్రిన్సిపల్ సిహెచ్ రవి గౌడ్ అన్నారు.

 

Nizamabad Narayana secures All India ranks in JEE Advanced results

 

ఇటీవల ప్రకటించిన జూనియర్ ఇంటర్ తెలంగాణ ఫలితాలలో గాట్ల వరెణ్య 469  మార్కులతో స్టేట్ 1 ర్యాంక్ సాధించి నిజామాబాదు జిల్లా ఖ్యాతిని నిజామాబాదు నారాయణ చాటిందని ఏజీమ్ లక్ష్మారెడ్డి తెలిపారు.

 

Nizamabad Narayana secures All India ranks in JEE Advanced results

 

అలాగే చంద్ర వర్ధన్ 468,  కదం అక్షర 468,  భాశెట్టి తన్మాయ్ 466,  అమృత వర్షిణి 466,  శ్రీనిధి 465,  ఇలా 18 మంది విద్యార్థులు 470 కి గాను 460 పైగా మార్కులు సాధించారు.

 

Nizamabad Narayana secures All India ranks in JEE Advanced results

 

ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్ బైపీసీ 440  మార్కులకు గాను 438 ,436 వంటి టాప్ మార్కులు పొందారు. అలాగే సీనియర్ ఇంటర్ లో 1000  మార్కులకు కాను 994  మార్కులతో అయేషా ఆఫీఫా నిజామాబాదు జిల్లా మొదటి మార్కులు సాధించి జిల్లా ఖ్యాతిని ఎలుగెత్తి చాటారు.

 

Nizamabad Narayana secures All India ranks in JEE Advanced results

 

అలాగే సింధు హర్షిని 992,  సద్ధి అక్షిత 992,  సిద్ది 990 , ఇలా ఎంపీసీ ,బైపీసీ లో కూడా రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం గర్వకారణం. ఇలాగే ఎంసెట్ లో 10వేల లోపు 19 మంది  జెఈఈ మెయిన్ ఫలితాలలో 25  మంది క్వాలిఫై  నీట్ ఫలితాలలో 8  ఎమ్ బి బి ఎస్ సెలెక్షన్స్.. ఇలా ఏ పోటీ పరీక్షలైనా నారాయణ కళాశాల నిజామాబాద్ జిల్లాకి గర్వకారణంగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జీఎం కాట్రగడ్డ శ్రీనివాసరావు,  అకాడమిక్ డైరెక్టర్ ప్రమీల కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

 

Nizamabad Narayana secures All India ranks in JEE Advanced results

More articles

Latest article