27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ అభ్యర్థి నరేంధర్ రెడ్డిని ఓడించడమే నా ధ్యేయం

Must read

📰 Generate e-Paper Clip

  • సీఎం పర్యటనకు ముందు కాంగ్రెస్ కు బిగ్ షాక్
  • బహిరంగంగా ప్రకటించిన మాజీ డిఎస్పీ గంగాధర్

 

నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ తరపున కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంధర్ రెడ్డిన ఓడించడమే తన ధ్యేయమని మాజీ డిఎస్పీ గంగాధర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 24న నరేందర్ రెడ్డి గెలుపుకోసం ప్రచారానికి వస్తున్న సమయంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ డీఎస్పీ మదనం గంగాధర్ షాకిచ్చారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీచేసేందుకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని తెలిపారు. ఈనెల 12న కాంగ్రెస్ పార్టీకి నీ అవసరం ఉందని పార్టీతో కలిసి పనిచేస్తే బలం పెరుగుతుందని మాజీ ఎంపీ హనుమంతరావు తనను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వద్దకు తీసుకువెళ్లారని తెలిపారు. అనూహ్యంగా తనకు పార్టీ కండువా వేసి పార్టీలో చేరినట్లు ప్రచారం చేశారన్నారు. అలాంటి సమయంలోనే తాను 13న తన నామినేషన్ ను ఉప సంహరించుకోవడం జరిగిందని తెలిపారు. మంత్రులు శ్రీదర్ బాబు, పొన్నం ప్రభాకర్ లను 11రోజులుగా కలుస్తున్నా ఎలాంటి స్పందన లేదన్నారు. సీఎంను కలిపిస్తామని తగిన ప్రాధాన్యత ఇప్పిస్తామని తన నామినేషన్ ను ఉపసంహరించుకునేలా చేసి మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలో భాగంగా తనచేత నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరిగిన రాజకీయ కుట్రలో తనను సమిదను చేశారని అందుకు కారణమైన కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అభ్యర్థి నరేంధర్ రెడ్డిని ఓడించాలని పట్టభద్రులకు విన్నవించారు. ఈ విషయంలో 42నియోజకవర్గాల్లో దళిత, బహుజనులను, మైనర్టీలను ఏకం చేసి ఓడించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని మాజీ డీఎస్సీ గంగాధర్ తెలిపారు. తనకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

More articles

Latest article