24 C
Hyderabad
Sunday, August 2, 2026

రేబిస్ పై అవగాహన ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ:  రేబిస్ వ్యాధి పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ రెబిస్ వ్యాధి దినోత్సవం సందర్భంగా పోస్టర్ ను కలెక్టర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేబిస్ ప్రాణాంతక  వ్యాధి అని అన్నారు. కుక్క కాటుకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కుక్క కరచిన వెంటనే శుభ్రమైన నీటితో కడిగి వైద్యుడిని సంప్రదించాలన్నారు. పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలన్నారు. పాఠశాలల విద్యార్థులు, యువతకు, ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పశు సంవర్థక అధికారి రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, సీపీవో రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article