రేబిస్ పై అవగాహన ఉండాలి

  కామారెడ్డి, బతుకమ్మ:  రేబిస్ వ్యాధి పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ రెబిస్ వ్యాధి దినోత్సవం సందర్భంగా పోస్టర్ ను కలెక్టర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేబిస్ ప్రాణాంతక  వ్యాధి అని అన్నారు. కుక్క కాటుకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కుక్క కరచిన వెంటనే శుభ్రమైన నీటితో కడిగి వైద్యుడిని సంప్రదించాలన్నారు. పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలన్నారు. పాఠశాలల విద్యార్థులు, యువతకు, ప్రతి...