28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బాన్సువాడలో కోతుల హంగామా…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తరిమితే దాడులు

 

. . . భయందోళనలో ప్రజలు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణ కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. కోతులు గుంపులుగుంపులుగా బయలుదేరి కాలనీలపై విరుచుకుపడుతున్నాయి. ఇళ్లు, కిరాణా దుకాణాలలో తినుబండరాలు, వస్తువులను ఎత్తుకెళ్లడంతోపాటు పండ్ల చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. అంతే కాకుండా ప్రజలపై దాడులకు దిగుతూ గాయపరుస్తున్నాయి. కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతుల నియంత్రణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని పట్టణ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

. . . ఇళ్లలోకి చొరబడి వస్తువుల అపహరణ

అడవిలో జీవించాల్సిన కోతులు ఊర్లమీద పడుతున్నాయి. అటవీ ప్రాంతాలు రోజురోజుకు తగ్గిపోవడం వాటికి అడవిలో ఆహారం లభించకపోవడంతో గ్రామాల్లోకి వస్తున్నాయి. గుంపులుగుంపులుగా కాలనీలలో సంచరిస్తూ వీరంగం సృష్టిస్తున్నాయి. ఇళ్లలో తయారు చేసుకున్న భోజనలతోపాటు పప్పు దినుసులు పట్టుకెళుతున్నాయి. కిరణా షాపులు, పండ్ల దుకాణాలదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపులోని వస్తువులకు రక్షణగా జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కోతుల బెడతతో పెంకుటిళ్లులు ధ్వంసం అవుతున్నాయి. అరుబయట ఎండబెట్టిన పప్పు దినుసులు ఇతర ఆహార పదార్థాలను వదలటంలేదు. ఇళ్లలో ఉన్న మామిడి, జామ, బొప్పాయి ఇతర పండ్లచెట్లు, కూరగాయాల చెట్లను సైతం వదలకుండ ధ్వంసం చేస్తున్నాయి.

. . . భయందోళనలో ప్రజలు

కోతుల బెడద రోజురోజుకు ఎక్కువ కావడంతో పట్టణ వాసులు భయందోళనలకు గురవుతున్నారు. ఇళ్లలో చొరబడి వీరంగం సృష్టిస్తున్న కోతులను తరిమే ప్రయత్నంలో అవి ప్రజలపై దాడులకు దిగుతున్నాయి. కొన్ని సందర్భలలో కోతి కాటుకు గురై ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మిద్దెల మీద గుంపులుగుంపులుగా ఒకచోట చేరి వచ్చి పోయే వారిపై దాడి చేస్తున్నాయి. కోతుల బెడద తీవ్రం కావడంతో కొంత మంది టపాసులు, పెద్ద శబ్ధాలు చేసి వాటిని తరిమి వేస్తున్నారు.

. . . నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలి

పట్టణంలో కోతుల నియంత్రణకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కోతులను బందించి పట్టణం నుంచి అటవీ ప్రాంతాలకు తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కోతుల వల్ల చాలా ఇబ్బందులు ఎదురోవాల్సివస్తుందని వాటి నియంత్రణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి కోతుల బెడద నుంచి విముక్తి చేయాలని కోరుతున్నారు.

 

Monkeys are rampaging in Banswada...

More articles

Latest article