24 C
Hyderabad
Sunday, August 2, 2026

మంత్రి పదవి ముఖ్యం కాదు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని ’ఎక్స్‘ వేదిక గా మరో సంచలన ట్వీట్ చేశారు. ’కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలుచేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని, అవినీతి రహితపాలన అందించాలని కోరతున్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నాను‘ అని రాజగోపాల్ రెడ్డి ’ఎక్స్‘ లో పోస్ట్ చేశారు. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

More articles

Latest article