వెబ్ న్యూస్, బతుకమ్మ : అఖండ-2 సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈమూవీ నెలకొన్న వివాదం ఎట్టకేలకు ముగిసింది. 14 రీల్స్ సంస్థ మరియూ ఈరోస్ సంస్థల మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో అఖండ-2 మూవీ రూపొందింది. ఈమూవీ ఈనెల 12 విడుదల కావడం ఖాయమని తెలుస్తోంది.