వెబ్ న్యూస్, బతుకమ్మ : అఖండ-2 మూవీకి బిగ్ షాక్ తగిలింది. ఈమూవీ ప్రీమియర్ షో రేట్లు పెంపుపై జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. సినిమా టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోరులో శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈపిటిషన్ పై గురువారం విచారణ జరిగింది. ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తో పాటు సినీ నిర్మాణ సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.