జనవరి 4న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి క్విజ్ పోటీలు

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రొహిబిషన్,ఎక్సైజ్ శాఖ, నిజామాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా పాఠశాల స్థాయి విద్యార్థులకు క్విజ్ పోటీలు జనవరి 4న నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి తెలిపారు. ఈ పోటీలను ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిజామాబాద్ లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్  వరకు చదువుతున్నపాల్గొనవచ్చని తెలిపారు. ఒక పాఠశాల, కళాశాల నుంచి 5 జట్లకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఒక జట్టులో ఇద్దరు విద్యార్థులు ఉండాలన్నారు.  నిత్య జీవితంలో సైన్స్  ఉపయోగం, మాదక ద్రవ్యాల వలన నష్టం  అనే అంశం మీద క్విజ్ జరుగుతుందని తెలిపారు. క్విజ్ తెలుగు, ఆంగ్లం భాషలో ఉంటుందన్నారు.

Joint Nizamabad District Level Quiz Competitions on 4th January
Comments (0)
Add Comment