ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రొహిబిషన్,ఎక్సైజ్ శాఖ, నిజామాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా పాఠశాల స్థాయి విద్యార్థులకు క్విజ్ పోటీలు జనవరి 4న నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి తెలిపారు. ఈ పోటీలను ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిజామాబాద్ లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నపాల్గొనవచ్చని తెలిపారు. ఒక పాఠశాల, కళాశాల నుంచి 5 జట్లకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఒక జట్టులో ఇద్దరు విద్యార్థులు ఉండాలన్నారు. నిత్య జీవితంలో సైన్స్ ఉపయోగం, మాదక ద్రవ్యాల వలన నష్టం అనే అంశం మీద క్విజ్ జరుగుతుందని తెలిపారు. క్విజ్ తెలుగు, ఆంగ్లం భాషలో ఉంటుందన్నారు.