27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గుండె సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సిరి హాస్పిటల్ డా. లింగా రెడ్డి

 

. . . ప్రతి మంగళవారం ప్రత్యేక గుండె వైద్య శిబిరం నిర్వహణ

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

గుండె సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని డా.లింగారెడ్డి సూచించారు. ఆర్మూర్‌ లోని సిరి హాస్పిటల్ లో ప్రతి మంగళవారం మెడికవర్ హాస్పిటల్ వారిచే ప్రత్యేక గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్మూర్, పరిసర ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక గుండె వైద్య సేవలు ఇప్పుడు మన సిరి హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. జగదీష్ చంద్ర బోస్ (మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్)ప్రతి మంగళవారం గుండె సంబంధిత వైద్య సేవలు అందించనున్నట్టు పేర్కొన్నారు.

 

Heart problems should not be ignored

 

ఈసీజీ, 2డిఎకో, టీఎంటీ, బీపీ, షుగర్ పరీక్షలు, ఛాతి నొప్పి, గుండె తడబాటు, శ్వాస ఇబ్బందులకు చికిత్స, హార్ట్ అటాక్ తర్వాత ఫాలోఅప్ లాంటి సేవలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. అపాయింట్‌మెంట్ కోసం ముందుగా సంప్రదించాలని, సిరి హాస్పిటల్ ఆర్మూర్ ప్రజల ఆరోగ్యానికి అంకితభావంతో సేవలు అందిస్తోందని పేర్కొన్నారు.

More articles

Latest article