. . . 10 మందికి భారీ జరిమానా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 13 మందిని పట్టుకున్నట్టు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ పి. ప్రసాద్ తెలిపారు. అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం బుధవారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ముందర హాజరుపరచగా 10 మందికి ఒకరికి 10,000/- చొప్పున 100,000/-జరిమానా విధించారు. మరోజు రంజిత్, గుంటి గారి సురేందర్, గాంధారి హరీష్ అనే ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి వారం రోజుల జైలు శిక్ష విధించినట్టు ఆయన తెలిపారు.