27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రైతు ఆత్మహత్యాయత్నం

Must read

📰 Generate e-Paper Clip

నల్గొండ, బతుకమ్మ :  నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని జి.యడపల్లి గ్రామానికి చెందిన గౌని వెకంన్న అనే రైతు బ్యాంకు అధికారుల  వేధింపులు తాళలేక మంగళవారం ఆత్మహత్యాయ్నం చేశాడు. స్థానికుల కథనం ప్రకారం.. గత 25ఏళ్ల క్రితం వెంకన్న తండ్రి స్థానిక కోపరేటివ్ బ్యాంక్ లో అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు ఇప్పుడు వడ్డీతో కలిపి లక్షా అరవై వేల రూపాయలకు చేరింది. దీంతో పాత బాకి కట్టాలని బ్యాంకు అధికారులు వెంకన్నకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా పాత  బకాయి కట్టకపోవడంతో వెంకన్న వ్యవసాయ భూమిలో జండాలు పాతి పాత బకాయిలు చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన వెంకన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

More articles

Latest article