28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లా బేస్ బాల్ సబ్ జూనియర్ బాలుర జట్టు ప్రాబబుల్స్ ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మండలం  తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల  క్రీడా మైదానంలో ఈరోజు జిల్లా బేస్ బాల్ బాలుర ప్రాబబుల్స్  జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రీడాకారులకు  ఆర్మూర్  క్రీడా మైదానంలో శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణలో భాగంగా తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన జట్టు  ఈ నెల  28 నుండి రెండు వరకు గజ్వేల్ లో కేజీ టూ పీజీ గ్రౌండ్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలో పాల్గొంటారు కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పూర్ణ చందర్ రావు, వైస్ ప్రిన్సిపల్ సాయన్న, జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్,సాఫ్ట్ బాల్  ప్రధాన కార్యదర్శి మరికంటి గంగా మోహన్,  పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జ్ఞానేశ్వర్, పిఈటి రాజేందర్, మరియు సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్ ఈ నరేష్ పాల్గొన్నారు.

More articles

Latest article