కోటగిరి, బతుకమ్మ: కోటగిరి మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో అఖండ హరినామ సప్తహ శుక్రవారం తో ముగిసింది. వారం రోజులపాటు కొనసాగిన సప్తహ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం రాత్రి సంకీర్తనలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. విఠలేశ్వర ఆలయంలో వివిధ గ్రామాలనుంచి వచ్చిన వర్కారి లు ప్రత్యేక పూజలు భజనలు నిర్వహించారు. చివరి రోజు అమూల్గా మహారాజ్ అన్ను మహారాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలని సూచించారు దైవచింతన అన్ని సమస్యలు దూరం అవుతాయని ఆయన అన్నారు. చివరి రోజు తెల్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అన్నదానం నిర్వహించిన దాతలు తెల్ల అక్షర రవికుమార్ దంపతులను సప్తహ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్ పటేల్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్, సప్తహ కమిటీ సభ్యులు కట్టు మోహన్ సెట్, సంతోష్ కుమార్, కట్టు శ్రీధర్, కట్టు నగేష్, దొండి బా మహారాజ్, కమ్మరి పెద్ద గంగాధర్, వడ్ల శ్యాంసుందర్, వడ్ల ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.