29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎమ్మెల్యే సారూ.. పట్టాలిప్పించండి

Must read

📰 Generate e-Paper Clip

. ఇందల్వాయి దళితుల వేడుకోలు

ఇందల్వాయి, బతుకమ్మ : పరంపోగు భూమిని తాము 60 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, తమకు పట్టాలిప్పించాలని మండల కేంద్రానికి చెందిన దళితులు వేడుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులకు 3ఎకరాల చొప్పున భూమి పంపిణీ చేయాలని కోరినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని తమకు పట్టాలిప్పించాలని కోరుతున్నారు. కార్యక్రమంలో ఎస్సీ అంబేద్కర్ కమ్యూనిటీ ఫార్మర్ సొసైటీ నాయకులు పాశం శ్రీనివాస్, కమ్మరి కర్రే గంగారాం, ఉండవు గోదావరి, మద్దెల గంగారాజం, కమ్మరి జానీ, ఉండ్రుగు పోచయ్య, పాశం పెద్ద నర్సయ్య, జెగ్గ పెద్దగంగారాం, కేపీ గంగారాం, సుకూరు రాజయ్య, కమ్మరి శివ, ఏపీ గంగారాం, తొగరి నర్సయ్య, జెగ్గ రాములు, గంగాదాస్, ఎరుకల గంగారాం, తుమ్మల గంగారాజం, తొగరి కాశీరాం తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article