
. పంటపొలాల్లో నుంచి దూసుకెళ్తున్న ఇసుక ట్రాక్టర్లు
బోధన్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మంజీరా పరీవాహక ప్రాంతమైన సిద్దాపూర్ శివారులోని పంటపొలాల్లో నుంచి ఇసుక ట్రాక్టర్లు దూసుకెళ్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. పంటసాగు కోసం నారు పోసిన మడుల్లో నుంచి సైతం ట్రాక్టర్లను తీసుకెళ్తున్నారని, తాము ఎలా బతకాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలుమార్లు తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేని, సబ్ కలెక్టర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

