27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నమ్మిన మాలలను నట్టేట ముంచిన కాంగ్రెస్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్ :- నమ్ముకున్న మాలల ను కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని, కాంగ్రెస్ పార్టీనీ రాబోయే రోజుల్లో బొంద పెడతామని అంబేద్కర్ మాల సంఘాల మండల అధ్యక్షుడు జిన్నా ప్రభాకర్  అన్నారు. వేల్పూర్ మండలం కేంద్రంలో శుక్రవారం  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేద్కర్ వాదులైన మాలల ను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసేందుకు మంద కృష్ణమాదిగ,చంద్రబాబు నాయుడు లతో కుమ్మక్కై వర్గీకరణ ద్వారా మాలల కు అన్యాయం చేశారని మండి పడ్డారు. 2011 జనాభా లెక్కల లో ఉపకులాల గణన జరగలేదని, తప్పుడు జనాభా లెక్కలతో వర్గీకరణ చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏండ్లు దాటిన తర్వాత పాత లెక్కలను ఎలా తీసుకుంటారని వారు ప్రశ్నించారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎమ్పరికల్ డేటా లేటెస్ట్ గా తీసుకోలేదని, మంత్రి వర్గ ఉపసంఘం లో ఒక్క మాల మంత్రి కూడా లేకపోవటం తో మాలలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపముఖ్య మంత్రి బట్టి విక్రమార్క కూడా మాలలకు ద్రోహం చేశారని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాల నాయకులను కలవలేదు అన్నారు.

More articles

Latest article