నమ్మిన మాలలను నట్టేట ముంచిన కాంగ్రెస్
బతుకమ్మ, వేల్పూర్ :- నమ్ముకున్న మాలల ను కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని, కాంగ్రెస్ పార్టీనీ రాబోయే రోజుల్లో బొంద పెడతామని అంబేద్కర్ మాల సంఘాల మండల అధ్యక్షుడు జిన్నా ప్రభాకర్ అన్నారు. వేల్పూర్ మండలం కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేద్కర్ వాదులైన మాలల ను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసేందుకు మంద కృష్ణమాదిగ,చంద్రబాబు నాయుడు లతో కుమ్మక్కై వర్గీకరణ ద్వారా మాలల కు అన్యాయం చేశారని మండి పడ్డారు. 2011 జనాభా లెక్కల లో ఉపకులాల...