27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

దళితులను బీఆర్ఎస్ అవమానించింది

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ: దళితులను బీఆర్ఎస్ మొదటి నుంచి అవమానిస్తూ, మోసం చేస్తూ వస్తోందని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమసాయిబాబా విమర్శించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఉద్దేశంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంటగలిపారన్నారు. గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేశారని, లోక్ సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లును పాస్ చేసిన మీరాకుమార్ తెలంగాణకు వచ్చి కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకుల తీరుకు వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article