27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మంత్రాల నెపంతో ఒకరిపై దాడి

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

మంత్రాల నెపంతో యువకుడిపై  కొంతమంది దాడి చేశారు. ఈ సంఘటన అదివారం అర్ధరాత్రి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో జరిగింది. దాడి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి నుండి బాధితున్ని  కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలిస్ ల కథనం ప్రకారం  అడ్లూర్ గ్రామానికి చెందిన గడ్డమీది సాయిలు తమకు మంత్రాలు చేస్తూ తమ కుటుంబాలను అనారోగ్యాల పాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై దాడికి పాల్పడ్డారు. అయితే గతంలో కూడా సాయిలుపై మంత్రాల నెపంతోనే దాడి చేశారని దీంతో అతను గ్రామాన్ని వదిలి కామారెడ్డిలో నివాసం ఉంటు మున్సిపాల్టీలో కార్మీకునిగా పని చేస్తున్నాడు. అదివారం గ్రామంలో  మిగిలిన ఇంటి సామాగ్రి తీసుకుపోవడానికి రాగా మళ్లీ వచ్చి మంత్రాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ దాడి చేసినట్లుగా సమాచారం. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా దాడి జరిగిన మాట వాస్తవమేనని, బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More articles

Latest article