29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పట్టభద్రుల ఓటు నమోదుకు మరో అవకాశం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ: శాసన మండల ఎన్నికల నేపథ్యంలో పట్టుభద్రుల ఓటు నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు.  డిసెంబర్ 9వ తేదీ వరకు మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.  ఆన్ లైన్ లో ఫారం- 18 భర్తీ చేసి లేదా తహసీల్ కార్యాలయాల్లో ఫారం – 18కి డిగ్రీ సర్టిఫికేట్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు జిరాక్సులను జత చేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2021 నంబర్ లోగా డిగ్రీ పూర్తయిన వారు ఓటు హక్కు నమోదుకు అర్హులని, గ్రాడ్యుయేట్ల తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

 

More articles

Latest article