29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అల్లు అర్జున్ నువ్వు ఆంద్రోడివి.. ఆంద్రోడిలానే ఉండు..

Must read

📰 Generate e-Paper Clip

  • రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే తెలంగాణలో నీ సినిమాలు ఆడనియ్యం
  • పగటి వేషాలు వేసుకొని బ్రతకడానికి వచ్చావు, అలానే బ్రతుకు
  • తెలంగాణ కోసం సినిమా వాళ్లు ఏం చేశారు
  • నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
  • అల్లు అర్జున్‌పై ఆగని కాంగ్రెస్ నాయకుల మాటల దాడులు

నిజామాబాద్, బతుకమ్మ: అల్లు అర్జున్ నువ్వు ఆంద్రోడివి.. ఆంద్రోడిలాగానే ఉండు.. సీఎం రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే తెలంగాణలో నీ సినిమాలు ఆడనియ్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హెచ్చరించారు. నువ్వు పగటి వేశాలు వేసుకుని బతకడానికి వచ్చావు అలాగే బతకాలని అన్నారు. నీవు తీసిన సినిమా అది ఏమైనా సామాజిక సినిమానా ఎర్రచందనం స్మగ్లర్ సినిమా తీసి నీతులు మాట్లాడుతున్నావ్ అన్నారు. మీకు ఇచ్చిన గౌరవాన్ని కాడుకుని ఇక్కడ వ్యాపారం చేసుకోవాలని సూచించారు. సమాజానికి ఏం చేశావని నీకు గౌరవం ఇవ్వాలని, డబ్బులు ఖర్చు పెట్టి వ్యాపారం చేసుకునే వాడివి దాన్ని కాపాడుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ కోసం సినిమా వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. పద్దతి మార్చుకోకుంటే తెలంగాణలో సినిమాలు ఆడనివ్వమని హెచ్చరించారు.

More articles

Latest article