25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు సమాజ సేవలో పాల్గొనాలి

Must read

📰 Generate e-Paper Clip

బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో

బోధన్ బతుకమ్మ : విశ్రాంత జీవితాన్ని సమాజ సేవకు ఉపయోగించాలని, పెన్షనర్లు ఉద్యోగంలో ఉన్న వారికి మార్గదర్షులని విశ్రాంత జీవితాన్ని సమాజానికి ఉపయోగించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. మంగళవారం బోధన్ లో తెలంగాణా అల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ బోధన్ డివిజన్ ఆధ్వర్యం లో నేషనల్ పెన్షనర్ డే వారోత్సవాలలో భాగం గా పెన్షనర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు ఏ సమస్యలు వున్న వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణ, సిర్ప హనుమండ్లు, శిర్ప లింగం, బోధన్ డివిజన్ సీనియర్ పెన్షనర్స్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మదన్మోహన్, అద్దంకి ఉషాన్, డివిజన్ కార్యదర్శి జ్ఞానేశ్వర్, ప్రకాశం, సత్యానంద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article