24 C
Hyderabad
Sunday, August 2, 2026

నేర్చికోవాలనే ఆసక్తి ఉంటే వయస్సు అడ్డుకాదు

Must read

📰 Generate e-Paper Clip

  • ఆమెచర్ తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ బస్వా లక్ష్మి నర్సయ్య

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే వయసు అడ్డు కాదని..ఏడేళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఎవరైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవచ్చునని ఆమెచర్ తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ బస్వా లక్ష్మి నర్సయ్య అన్నారు.  ఆరోగ్యంగా ఉండడానికి మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని సూచించారు.  నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్ లో తైక్వాండో క్రీడాకారులు గత ఎనిమిది సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది. ఇందులో గత ఐడేళ్లుగా బస్వా లక్ష్మి నర్సయ్య శిక్షణ పొందుతూ బ్లాక్ బెల్ట్ సాధించారు. జాతీయ స్థాయి తైక్వాండో లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించి జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపారు.

Age is no barrier if you are interested in learning

ఈ సందర్బంగా బస్వా  లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ నేటి సమాజంలో ఆడపిల్లలు శారీరకంగానే కాకుండా మానసికంగా ఎదగాలనే ఉద్దేశంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే మానసిక ప్రశాంతతో వాళ్ళు చదువులో అని రంగాల్లో ముందుంటారన్నారు. నేటి సమాజంలో సమాజంలో ఆడపిల్లలపై అరాచకాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు మార్షల్ ఆర్ట్స్ విద్యతో వారిని వారు కాపాడుకోగల నమ్మకం వారికి ఏర్పడుతుందన్నారు. ప్రతి రోజు తైక్వాండో విద్యను నేర్చుకుంటున్నామని.

Age is no barrier if you are interested in learning

ఈ తైక్వాండో కేవలం వారి ఆరోగ్యం కోసమే గాక .ఈ సర్టిఫికెట్స్ పిల్లల చదువుకు ఉపయోగపడుతుందని, వీటితో బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు . కోచ్ మనోజ్ కుమార్ అంకిత భావంతో తైక్వాండో లో ఉత్తమ శిక్షణ ఇస్తున్నారని.. ఇది అందరి శారీరక దారుద్యానికి, మానసిక ఆరోగ్యానికి దోహద పడుతుందన్నారు.నేడు సమాజానికి టైక్వాండో క్రీడాకారులు అందరికీ తాను స్ఫూర్తిగా నిలబడడం తను అదృష్టంగా భావిస్తున్నారు. ప్రతి దినము టైక్వాండో నేర్చుకుంటూ నేటి సమాజంలో తల్లిదండ్రులు పిల్లలు ప్రతి ఒక్కరికి వ్యాయామం చాలా అవసరం అన్నారు మనది మనం విష జ్వరాల నుంచి కరోనా వైరస్ వంటి వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు మనం ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం ఎంతో అవసరమని తెలియజేశారు. మనం మన ఆహారం కరెక్ట్ గా తీసుకోవడం వలన మనం ఎప్పుడూ చురుగ్గా ఉండగలం. ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ప్రతి ఒక్కరు యోగా టైక్వాండో వంటి వ్యాయామం తప్పనిసరిగా చేయాలి అని తెలియజేశారు.

Age is no barrier if you are interested in learning

More articles

Latest article